Page Loader
USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం

USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక భేటీ నిర్వహించారు. డెలావేర్‌లోని బైడెన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, 'భారత్-అమెరికా' వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తదితర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చలు సానుకూలంగా ముగిసినట్లు భేటీ అనంతరం ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

Details

భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం

ఇదిలా ఉండగా, భారత్-అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉందని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం సన్నిహితంగా, చైతన్యవంతంగా మారిందన్నారు. ప్రతి భేటీలో కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయని మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ భేటీ ద్వారానే భారత్‌-అమెరికా సంబంధాలు మరింత ధృడంగా మారినట్టు మోదీ స్పష్టం చేశారు