G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
భారతదేశంలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యూఏఈ-UNITED ARAB EMIRATES G-20 గ్రూపులో సభ్య దేశ కానప్పటికీ భారత్ ఆహ్వానం మేరకు ఈ కీలక శిఖరాగ్ర సమావేశానికి ఆ దేశం హాజరుకానుంది. ఈ నేపథ్యంలోనే భారత్-యూఏఈ దేశాల మధ్య ఆహార భద్రత, రక్షణ, వాణ్యిజ్య రంగంలో మరోసారి కీలక చర్చలు జరపనున్నారు. భారత్, యూఏఈ మధ్య గత కొన్నాళ్లుగా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. బిన్, భారత పర్యటనతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది.విద్య,ఆరోగ్య రంగంపైనా ఇరు దేశాలు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి.
20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ కు మోదీ
మరోవైపు గతేడాది బిన్ యూఏఈ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా భారత్ రానున్నారు. గత జులై 15న ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నా ప్రధాని మోదీ, అటు నుంచే సరాసరిగా యూఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు సాగించారు. చంద్రయాన్-3 విజయవంతాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 24న ప్రధాని మోదికి బిన్ ఫోన్ చేసి అభినందించారు. అంతేకాకుండా ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశంలో యూఏఈ సభ్యత్వానికి భారత్ మద్దతు పలికినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో మోదీ పర్యటించనున్నారు. జకార్తాలో జరగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో చేరనున్న యూఏఈ
ఈ మేరకు రెండు శిఖరాగ్ర సమావేశాలను జకార్తాలో జరగనున్నాయి. ఈ మేరకు ఆసియాన్ సమ్మిట్ హోస్ట్ దేశంగా ఇండోనేషియా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 4న G-20 చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ ష్రింగ్లా, హోంకార్యదర్శి అజయ్ భల్లా, సెక్రటరీ అపూర్వచంద్ర శిఖరాగ్ర సమావేశాల భద్రత, పూర్తి ఏర్పాట్లపై 2 గంటలపాటు మోదీకి ప్రజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు జీ-20కి సంబంధించిన వివిధ అంశాలపై ఇవాళ ఉదయం కేంద్ర మంత్రిమండలికీ వివరించనున్నారు. బిన్, భారత పర్యటనలో ప్రధాని మోదీ ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో యూఏఈ చేరనుంది. యూఏఈ భారతదేశానికి సన్నిహిత దేశంగా గుర్తింపు పొందింది.