Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి నిరూపితమైంది. సెప్టెంబర్ 22న అమెరికాలో "మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా జరగనుంది. ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది. 15 వేల సీట్ల సామర్థ్యం ఉన్న ఈ వేదిక కోసం ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ (IACU) తెలిపింది. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేయడంతో, అదనపు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరుకావడంతో ఈ సంఖ్య మరింత పెరిగిందని సమాచారం.
ఈవెంట్ లో మోదీ ప్రసంగం, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళలు, వినోద కార్యక్రమాలు
'అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఈ ఈవెంట్‌కి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నది. ఈ కార్యక్రమం భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ప్రాధాన్యమైనది. విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం'' అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళలు, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
మరోవైపు ఐక్యరాజ్య సమితి (UN) తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 26న యూఎన్ జనరల్ అసెంబ్లీ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ న్యూయార్క్‌లో నిర్వహించిన భారీ కమ్యూనిటీ ఈవెంట్‌కు హాజరయ్యారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో NRG స్టేడియంలో నిర్వహించిన మెగా కమ్యూనిటీ ఈవెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. మోదీ విదేశీ పర్యటనల్లో ఎక్కడైనా, అక్కడి ప్రజలు ఆయనను ఎంతో అభిమానంతో స్వాగతిస్తారు. రష్యాలో జరిగిన ఆయ