Page Loader
40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
40 ఏళ్లకు అడుగుపెట్టిన తొలి ప్రధానిగా గుర్తింపు

40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.1983లో ఇందిరాగాంధీ గ్రీస్‌లో చివరిసారిగా పర్యటించారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ,ఆ దేశంలో పర్యటిస్తున్నారు.రాజధాని ఏథెన్స్‌లో మోదీ దిగగానే గ్రీస్‌లోని భారతీయులు ఘన స్వాగతం పలికారు. పాకిస్థాన్‌ కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడంతో భాంగ్రా నృత్యంతో మోదీకి స్వాగతం పలికినట్లు గ్రీస్ నివాసి దల్జీత్ సింగ్ అన్నారు. గ్రీస్ ప్రెసిడెంట్ కాటెరినా సకెల్లారోపౌలౌ శుక్రవారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ ను ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతం కోసం ఇద్దరు దేశాధినేతలు చర్చించనున్నారు.వ్యాపారవేత్తలతోనూ మోదీ మాట్లాడనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రీస్ దేశంలో మాట్లాడుతున్న మోదీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రీస్ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించిన మోదీ