PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.
ఇది ఫిబ్రవరి చివరిలో జరుగుతుందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని, ఇది ఫిబ్రవరి చివరిలో ఉంటుందన్నారు.
ఇప్పటివరకు భారత్‌ను సందర్శించలేదని, కానీ అక్కడ చరిత్రాత్మక సంస్కృతి, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించేందుకు ఎదురు చూస్తున్నానని ఫ్రిడ్‌మాన్ పేర్కొన్నారు.
అయితే ప్రధాని కార్యాలయం ఈ పాడ్‌కాస్ట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
2018 నుంచి "లెక్స్ ఫ్రిడ్‌మాన్" పేరిట పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న ఫ్రిడ్‌మాన్, సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, రాజకీయ రంగాల్లో ప్రముఖులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
Details
యూట్యూబ్ లో 4.5 మిలియన్ల పైగా ఫాలోవర్లు
ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా అనేక మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసిన ఫ్రిడ్‌మాన్‌కు యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఆ పాడ్‌కాస్ట్‌లో వారు రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్ల వంటి అనేక అంశాలపై చర్చించారు.