UK PM Keir Starmer: అవసరమైతే మా దళాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాం: కైర్ స్టార్మర్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా యూకే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా, ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన సహాయాన్ని అందించేందుకు యూరప్ దేశాలు సిద్ధమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, యూరప్‌లో భద్రతను స్థిరంగా ఉంచేందుకు అవసరమైతే ఉక్రెయిన్‌కు బ్రిటన్ తన సైనిక దళాలను పంపించేందుకు సిద్ధంగా ఉంటుందని బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ స్పష్టం చేశారు.
"ఈ ప్రకటనను నేను తేలికగా చేయడం లేదు.. ఈ నిర్ణయం బ్రిటన్ సైనికులు, మహిళలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
ఇక,ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై నెలకొన్న ఆందోళనలను చర్చించేందుకు,ఈరోజు (ఫిబ్రవరి 17) పారిస్‌లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో తాను హాజరవుతున్నట్టు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ధృవీకరించారు.
వివరాలు
యూరప్, అమెరికా కలిసి పనిచేయడంలో బ్రిటన్ కీలక పాత్ర
రాబోయే రోజుల్లో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నట్లు కూడా ప్రకటించారు.
యూరప్, అమెరికా కలిసి పనిచేయడంలో బ్రిటన్ కీలకమైన పాత్రను పోషిస్తుందని ఆయన వివరించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడంలో అమెరికా భద్రతా హామీ అత్యంత అవసరం, ఎందుకంటే పుతిన్ మళ్లీ దాడి చేయకుండా అడ్డుకోవడం యూఎస్ చేతనే సాధ్యమవుతుందని స్టార్మర్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసి మూడేళ్లు పూర్తయ్యే సందర్భాన్ని పురస్కరించుకుని జరగనున్న ఈ సమావేశంలో జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల నాయకులు హాజరయ్యే అవకాశముంది.