Donald Trump: కమలా హారిస్ ఇండియానా లేక నల్లజాతి మహిళానా?.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమాలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు. అమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారని, ఇప్పుడు సడన్ గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారని డొనాల్డ్ పేర్కొన్నాడు. కమలా హారిస్ ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం తనకు తెలియలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్‌లోని ఇంటర్వ్యూయర్ల ప్యానెల్‌తో ట్రంప్ కమలా హరిస్‌ను ప్రశ్నించారు.
ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరం
ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెల్లడించింది. వారు ఎవరో, వారు ఎలా గుర్తించారో చెప్పే హక్కు ఎవరికీ లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కమలా హారిస్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి