
సముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఎల్లో సముద్రంలో ఉచ్చులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది చైనా నావికులు చనిపోయినట్లు యూకే ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది.
ఇతర దేశాల కోసం ఏర్పాటు చేసిన సముద్రపు ఉచ్చులో చిక్కుకోవడంతో చైనా అణు సబ్‌మెరైన్ '093-417' ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
వాస్తవానికి ఈ ప్రమాదం ఆగస్టు 21న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చైనా తమ 55మంది సబ్‌మెరైనర్లను కోల్పోయినా.. ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.
తాజాగా బ్రిటన్ సబ్‌మెరైనర్లు ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా కూడా ప్రమాదంలో జరిగినట్లు చెబుతోంది.
చైనా
ఆ ఉచ్చును ఏర్పాటు చేసింది చైనానే?
చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లోని ఎల్లో సముద్రంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలాంతర్గామి ఆగస్టు 21వ తేదీన సముద్రంలో చిక్కుకుంది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో క్వింగ్‌డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఈ ప్రదేశంలోకి అమెరికా, బ్రిటన్‌లకు చెందిన జలాంతర్గాములు రాకుండా చైనా 'చైన్, యాంకర్ ఉచ్చు'ను ఏర్పాటు చేసినట్ల బ్రిటన్ మీడియా రాసుకొచ్చింది.
చైనా ఏర్పాటు చేసిన ఉచ్చులో ఆ దేశానికి చెందిన సబ్ మెరైన్ చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సబ్ మెరైన్ ప్రమాదంలో 22మంది ఆఫీసర్లు, 7 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 9మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు బ్రిటన్ మీడియా చెబుతోంది.