Shehbaz Sharif: హఫీజ్ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన పాక్ ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం అంశంలో పాకిస్థాన్ వైఖరిపై తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) 81వ సర్వప్రతినిధి సభ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. లష్కరే తయ్యిబా (LeT) అధినేత హఫీజ్ సయీద్, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఆయన స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వివరాలు
''ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?''
ఐరాస ప్రధాన కార్యాలయంలోకి షెహబాజ్ షరీఫ్ ప్రవేశిస్తున్న సమయంలో ఓ భారతీయ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు ఆయనను ప్రశ్నించారు.
''ప్రధాని గారూ.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ఎప్పుడు ఆపుతారు?'' అని అడిగారు.
అయితే షెహబాజ్ షరీఫ్ ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. స్పందించకుండానే ముందుకు సాగిపోయారు.
ఆ తర్వాత సమావేశాలు ముగించుకుని ఐరాస ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలోనూ జర్నలిస్టులు మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
''లష్కరే తయ్యిబా అధినేత హఫీజ్ సయీద్‌పై ఎప్పుడు విచారణ చేపడతారు?'' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా పాక్ ప్రధాని సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వివరాలు
భారత్ నుంచి పాక్‌కు గట్టి సందేశం
ఇదిలా ఉండగా.. ఐరాస సమావేశాల సందర్భంగా ఉగ్రవాదం అంశంపై భారత్ పాకిస్థాన్ తీరును ప్రశ్నించింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కాకుండా.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునే మార్గాలపై పాక్ దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.
ఈ నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో సయీద్ భారత్ దర్యాప్తు సంస్థల ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.
వివరాలు
పహల్గాం కేసులోనూ సయీద్ పేరు
2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కేసులోనూ హఫీజ్ సయీద్ పేరు తాజాగా నిందితుల జాబితాలోకి వచ్చింది.
ఈ కేసులో భారత జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)2026 జులైలో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో సయీద్‌ను నిందితుడిగా చేర్చింది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తయ్యిబా,దాని అనుబంధ సంస్థల పాత్రపై దర్యాప్తులో ఆధారాలు లభించాయని ఎన్‌ఐఏ పేర్కొంది.అయితే పహల్గాం దాడిలో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ గతంలో ఖండించింది.
భారత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని పాక్ కోరినట్లు ఆ దేశ మీడియా కూడా పేర్కొంది.
ఐరాస వేదికకు వచ్చిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను హఫీజ్ సయీద్,ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారన్నఆరోపణలపై వరుసగా ప్రశ్నించగా..ఆయన రెండు సందర్భాల్లోనూ స్పందించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉగ్రవాదులపై ప్రశ్నకు పాక్ ప్రధాని మౌనం
ANI asks Shehbaz Sharif: “When will you prosecute Hafiz Saeed?” The Pakistani PM walks away without answering as he leaves the UN headquarters in New York. pic.twitter.com/0ppTq9qXwQ
— SILENT BRIEF (@SilentBriefHQ1) September 25, 2026