LOADING...
Russian Plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం తూర్పు అముర్ ప్రాంతంలో అదృశ్యం 
50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం తూర్పు అముర్ ప్రాంతంలో అదృశ్యం

Russian Plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం తూర్పు అముర్ ప్రాంతంలో అదృశ్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉన్న సంబంధాన్ని ఒక్కసారిగా కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. మిస్సైన ఈ విమానం ఏఎన్-24 మోడల్కి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటన రష్యాలోని తూర్పు ప్రాంతమైన అముర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. విమానంలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విమానాన్ని అంగారా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. చైనాతో సరిహద్దు వద్ద ఉన్న అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం వైపు ఈ విమానం దూసుకెళ్తోంది. అయితే టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే, విమానం గాలిలో మాయమైంది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉన్న కమ్యూనికేషన్ పూర్తిగా కట్‌ అయిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ర‌ష్యా విమానం అదృశ్యం