Page Loader
Woman Biker: రైడింగ్ చేస్తూ అందమైన రష్యన్ బైకర్ మృతి 

Woman Biker: రైడింగ్ చేస్తూ అందమైన రష్యన్ బైకర్ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో అత్యంత అందమైన బైకర్‌గా పేరుగాంచిన టాట్యానా ఓజోలినా(Tatyana Ozolina) టర్కీలో జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో మరణించింది. నివేదికల ప్రకారం, ముగ్లా ప్రావిన్స్‌లోని మిలాస్ సమీపంలో 38 ఏళ్ల టట్యానా మరణించింది. టాట్యానా తన ఎరుపు రంగు BMW S1000RR 2015 బైక్‌ను నడుపుతున్నప్పుడు నియంత్రణ కోల్పోయిందని, ఆ తర్వాత ఆమె బైక్ ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మూలాల ప్రకారం, ఆమె వెనుకే బైక్ పై కూర్చున్న టర్కిష్ బైకర్ ఒనుర్ ఒబుట్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న మరో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

వివరాలు 

టాట్యానా ఓజోలినా ఎవరు? 

టాట్యానా ఓజోలినా బైకర్,ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు బైక్ ప్రేమికులలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. 38 ఏళ్ల టట్యానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్లు, టిక్‌టాక్‌లో ఐదు మిలియన్ల ఫాలోవర్లు, యూట్యూబ్‌లో రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. బైక్, ట్రావెల్ వీడియోలతో ఆమె తన అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉంది.

వివరాలు 

రష్యా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ బైకర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య రష్యన్లపై విధించిన ఆంక్షల సమయంలో గ్రీస్ సరిహద్దులో యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించడంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన రైడింగ్‌లు చేసే ఈ ఇన్‌ప్లుయెన్సర్‌ను 'రష్యా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ బైకర్‌ గా' అభిమానులు పేర్కొంటారు. ఈమెకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.