Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌లోని బాట్‌యామ్ సిటీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.
అధికారులు అందించిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం బాట్‌యామ్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి.
సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య విభాగం అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక అధికారులు ధృవీకరించారు. పోలీసులు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదే సందర్భంలో, పాలస్తీనా ఉగ్రవాద సంస్థలు ఈ పేలుళ్లకు బాధ్యత వహించి ఉండవచ్చని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ అభిప్రాయపడ్డారు.
వెస్ట్‌బ్యాంక్‌లో పరికరాల పరిశీలనలో తాజా పేలుడు పదార్థాలు కనుగొనడం,ఈ పేలుళ్లకు సంబంధం ఉందని టెల్‌అవీవ్ పోలీసు అధికారి తెలిపారు.
వివరాలు
హమాస్ అప్పగించిన మృతదేహం వివాదం
దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఈ ఘటనపై అత్యవసర భద్రతా సమీక్షా సమావేశాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, హమాస్ వారి చెరలో మరణించిన నలుగురు ఇజ్రాయెలీ మృతదేహాలను టెల్‌అవీవ్‌కు అప్పగించింది.
అయితే, అందులో ఒక మృతదేహం ఇజ్రాయెల్‌కు చెందిన మహిళది కాదని ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది.
హమాస్ ఈ విధంగా ఓప్పందాన్ని ఉల్లంఘించిందని టెల్‌అవీవ్ ఆరోపించింది.
వివరాలు
మృతదేహాల ప్రదర్శన.. తీవ్ర విమర్శలు
ఖాన్‌యుస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, రెడ్‌క్రాస్ షిర్ బిబాస్, ఆమె కుమారులు ఎరియల్, కఫీర్‌లతో పాటు మరొక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.
అయితే, హమాస్ ఈ మృతదేహాలను ప్రదర్శనకు పెట్టడం తీవ్ర విమర్శలకు గురైంది.
2023 అక్టోబర్ 7న, ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్ నీరోజ్ ప్రాంతం నుండి హమాస్ వీరిని అపహరించింది.
తర్వాతి కాలంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వీరు మరణించారని మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.