Bangladesh : బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలకు 'షేక్ హసీనా' పార్టీ ప్లాన్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచి మూడు నెలలు అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్ ప్రస్తుతం దేశంలో వ్యతిరేక నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఢాకాలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో అవామీ లీగ్ నిరసనలు చేయటానికి ప్రయత్నిస్తుండగా, తాత్కాలిక ప్రభుత్వం నుండి కఠిన హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఎలాంటి హింసను సహించదని, శాంతిభద్రతలను భంగపర్చే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఆగస్టు నెలలో, అవామీ లీగ్ విద్యార్థి విభాగం 'ఛత్ర లీగ్' ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో తిరుగుబాటు ఆందోళనలు పెరిగాయి.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలి
అవామీ లీగ్ పార్టీ దేశ ప్రజల హక్కులను హరించేందుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ విముక్తి యుద్ధంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు అందజేస్తున్నాయి. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించినా, విద్యార్థులు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల కారణంగా అవామీ లీగ్ నిరసనలు మరింత విస్తృతమయ్యాయి, దీని వల్లే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.