Sheikh Hasina: డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. భారత్ పెట్టిన షరతులివేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆమె తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు భారత్ సుముఖంగానే ఉన్నప్పటికీ.. హసీనా భద్రత విషయంలో పొరుగు దేశం హామీ ఇవ్వాలని పలు షరతులు విధించినట్లు సమాచారం. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
హసీనా భద్రతపై భారత్ షరతులా?
హసీనాపై ఎలాంటి దాడులు జరగకుండా భద్రత కల్పించాలని భారత్ కోరినట్లు తెలుస్తోంది.
అలాగే తనకు విధించిన మరణశిక్షపై హసీనా న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని షరతు పెట్టినట్లు సమాచారం.
నిష్పక్షపాతంగా విచారణను ఎదుర్కొని న్యాయం పొందేలా చూడాలని, 2024లో జరిగిన అణచివేత ఘటనలపై తిరిగి విచారణ జరపాలని కూడా కోరినట్లు బంగ్లా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
హసీనాను తీసుకెళ్లేందుకు సైనిక విమానం పంపాలా?
హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లేందుకు ఆ దేశం తమ సైనిక విమానాన్ని పంపాలని భారత్ కోరినట్లు సదరు కథనాలు వెల్లడించాయి.
లేదంటే భారత్-బంగ్లాదేశ్ భూ సరిహద్దు మార్గంలో పొరుగు దేశ సైన్యం హసీనాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలని షరతు విధించినట్లు పేర్కొన్నాయి.
వివరాలు
బంగ్లా ప్రభుత్వం ఏమందంటే?
ఈ కథనాలపై బంగ్లాదేశ్ ప్రధాని సహాయ మీడియా కార్యదర్శి నజ్ముల్ హక్ స్పందించారు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు ఏ దేశమూ సుముఖంగా లేదని వ్యాఖ్యానించారు.
ఆమెకు ఒక్కొక్కటిగా అన్ని మార్గాలు మూసుకుపోయాయని అన్నారు. చివరి ప్రయత్నంగా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని ఆమె కోరుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.
అయితే, హసీనా విషయంలో భారత్ షరతులు విధించినట్లు వస్తున్న వార్తలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించలేదు.
మరోవైపు ఈ కథనాలపై స్పందించడానికి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ కూడా నిరాకరించడం గమనార్హం.