Naim Kassem: హిజ్‌బొల్లా నూతన నాయకుడిగా షేక్ నయిమ్ కాస్సెమ్
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్‌బొల్లా, తమ కొత్త నేతగా షేక్ నయిమ్ కాస్సెమ్‌ను ఎంపిక చేసింది. ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో హిజ్‌బొల్లా మాజీ నేత హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నస్రల్లాకు డిప్యూటీగా ఉన్న కాస్సెమ్ ఇప్పుడు హిజ్‌బొల్లా నేతగా పగ్గాలు చేపట్టనున్నారు. నస్రల్లా మరణానంతరం తాత్కాలిక నేతగా బాధ్యతలు నిర్వహించిన కాస్సెమ్‌ను, హిజ్‌బొల్లా సురా కౌన్సిల్ పర్మినెంట్ లీడర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
మూడు దశాబ్దాలపాటు నస్రల్లాతో పనిచేసిన కాస్సెమ్
సుమారు మూడు దశాబ్దాలపాటు నస్రల్లాతో కలిసి పనిచేసిన కాస్సెమ్, హిజ్‌బొల్లా పాలసీలను ముందుకు తీసుకెళ్లడం తన లక్ష్యమని తెలిపారు. ఇక ఇజ్రాయిల్ ఇటీవల నిర్వహించిన దాడిలో 60 మంది మరణించారు. ఈ దాడి ఐదు అంతస్తుల భవనం మీద జరిగిందన్నారు. అక్కడ ఉత్తర గాజా ప్రాంతానికి చెందిన పలస్తీనీయులు నివసిస్తున్నట్లు సమాచారం. మృతులలో సగం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.