
Sheikh Hasina: షేక్ హసీనాకు షాక్.. కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ తీర్పును ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, గత సంవత్సరం దేశంలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, అవినీతికి సంబంధించి వెలుగులోకి వచ్చిన పరిణామాల నేపథ్యంలో, హసీనా తన పదవిని కోల్పోయి దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందారు.
Details
షేక్ హసీనాకు అరెస్టు వారెంటీ జారీ
ఆ సమయంలో ఆమెతో పాటు పలు రాజకీయ నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదు కాగా, ఐసీటీ ఇప్పటికే షేక్ హసీనాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రస్తుత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, షేక్ హసీనా దేశానికి తిరిగే అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై ఉన్న కేసులపై మరింత దృష్టి సారించడంతో, బంగ్లా రాజకీయాల్లో మరో కీలక మలుపు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.