
US Immigration: ట్రంప్ పాలసీలతో షాక్.. 60 ఏళ్లలో కనిష్ఠానికి వలస జనాభా!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి వలసదారులపై గట్టి చర్యలు కొనసాగిస్తున్నారు. మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు విధించడం వలస జనాభాపై గణనీయమైన ప్రభావం చూపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తోన్న వలసదారులపైనా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీంతో బంగారు భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లాలనుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా వెల్లడించింది.
Details
15 లక్షల వలసదారులు తగ్గిపోయారు
2025 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో వలస జనాభా 15 లక్షల మేర క్షీణించింది. దీంతో అమెరికాలో ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలా వలస జనాభా తగ్గిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది ఒక అనూహ్య మార్పు అని ప్యూ రీసెర్చ్ సెంటర్ డెమోగ్రాఫర్ జెఫ్రె పస్సెల్ వ్యాఖ్యానించారు. లేబర్ మార్కెట్‌పై ప్రభావం ఈ తగ్గుదల అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. 'అమెరికా జనాభాలో పనిచేసే వయసున్న వారి సంఖ్య స్థిరంగా ఉంది. కొత్త శ్రామిక శక్తి వలసదారుల నుంచే వస్తుంది. వారు తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థకు కష్టమేనని జెఫ్రె అన్నారు.
Details
బైడెన్ నుంచి ట్రంప్ వరకు
సరిహద్దుల గుండా అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు బైడెన్ పాలనలో కొన్ని చర్యలు తీసుకోవడంతో 2024 నుంచే వలసదారుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ట్రంప్ కఠిన విధానాలు ఈ క్షీణతను మరింత వేగవంతం చేశాయని నివేదిక పేర్కొంది. డిపోర్టేషన్లే కీలక కారణం మాస్ డిపోర్టేషన్లు, బహిష్కరణను తప్పించుకునేందుకు ఉన్న రక్షణలు తొలగించడం కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అనధికారిక వలసల సంఖ్య కూడా తగ్గిపోవడం గమనార్హమని తెలిపింది.