Page Loader
Sheikh Hasina: 'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా 
'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా

Sheikh Hasina: 'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న విషయం విదితమే. ఉద్యోగాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం క్రమంగా హింసాత్మక రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. విద్యార్థుల నిరసన తీవ్రమవడంతో బంగ్లాదేశ్ సైన్యం అప్రమత్తమై, అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేయాలని సూచించింది. ఆ సమయంలో షేక్ హసీనా సైన్యంతో "నన్ను కాల్చి చంపండి.. ఇక్కడే ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి" (Shoot, bury me here) అని చెప్పినట్లు ఇటీవల వెల్లడైంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ (International Crimes Tribunal) విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తాజుల్ ఇస్లాం (Mohammad Tajul Islam) తెలియజేశారు.

వివరాలు 

తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్

ఈ అల్లర్ల దశలో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలోకి దిగింది. తాత్కాలికంగా దేశపాలనను తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నియమితులయ్యారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ఆయన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.