
ఉత్తర అమెరికా : మెక్సికో బార్‌లో భీకర కాల్పులు.. ఆరుగురి మృత్యవాతEmbed
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడింది ఓ ముఠా పనేనని, జాలిస్కో పోలీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
మెక్సికో స్వాతంత్ర వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే నగరంలో కాల్పులు భయాందోళన రేపింది. ఈ మేరకు జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటన చేసింది.
బార్‌లో పద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారనీ, ఈ క్రమంలోనే కొందరు దుండగులు తుపాకులతో విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో జరిగిన కాల్పుల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
DETAILS
మెక్సికోలో అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటిగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్
వాస్తవానికి కాల్పుల్లో నాలుగు మరణాలే చోటు చేసుకున్నట్లు అధికారులు తొలుత భావించారు. అయితే శనివారం ప్రాసిక్యూటర్లు ఆరుగురు మరణించినట్లు ధృవీకరించారు.
మెక్సికోలోని అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటిగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజా కాల్పుల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
2006 చివరిలో ఫెడరల్ ప్రభుత్వం సైనిక మద్దతుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దాడిని ప్రారంభించింది. ఈ మేరకు దాదాపుగా 3 లక్షల 40 వేల మందికిపైగా హత్యలు జరిగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది.
దాదాపు లక్ష మందికిపైగా అపహరణ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అందులో ఎక్కువ భాగం నేర సంస్థలతో ముడిపడి ఉన్నాయని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓ వైపున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు,మరోవైపు కాల్పుల మోత
Red, White, and Green in honor of Mexican Independence Day
— Empire State Building (@EmpireStateBldg) September 15, 2023
📷: vikvik7/IG pic.twitter.com/eZyWj2Ei68