Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు.. 71 ఏళ్ల షూటర్ ఎవరు?
స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59)పై బుధవారం నాడు కాల్పులు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) హ్యాండ్లోవాలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాని ఫికో గాయపడ్డారు. ప్రస్తుతం అయన బన్స్కా బిస్ట్రికా నగరంలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే అరెస్టు చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, అయన ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డారు.అయన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ మేరకు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఎరిక్ థామస్ వెల్లడించారు.
ఫికో కడుపులో తీవ్ర గాయాలు
అయన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఫికోపై పలుమార్లు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయనను హెలికాప్టర్‌లో బన్స్‌కా బైస్ట్రికాకు తరలించారు. రాజధానికి ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలో ఈ ఘటన జరిగిందని స్లోవేకియా న్యూస్ టెలివిజన్ స్టేషన్ TA3 నివేదించింది. నివేదిక ప్రకారం, ఫికో కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధానిపై దాడిని అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు.
రాబర్ట్ ఫికో పై కలుపులు జరిపింది 71 ఏళ్ల వృద్ధుడు
71 ఏళ్ల వృద్ధుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్లోవాక్ మీడియా పేర్కొంది. సుతాజ్ ఎస్టోక్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అనుమానితుడు DUHA (రెయిన్‌బో) లిటరరీ క్లబ్ వ్యవస్థాపకుడు. లూయిస్ నగరానికి చెందినవాడని మీడియా నివేదికలు తెలిపాయి. నిందితుడు మూడు కవితా సంకలనాలు రాశాడు. స్లోవాక్ రచయితల అధికారిక యూనియన్ సభ్యుడు. ఈ ఘటనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు.