
South korea: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.
అభిశంసన తీర్మానం గట్టెక్కాలంటే, పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం.
దక్షిణ కొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులు ఉన్నారు, అందులో 200 మంది సభ్యుల మద్దతు సాధించడం ద్వారా ఈ తీర్మానం గట్టెక్కవచ్చు.
ఈ తీర్మానం శుక్రవారం లోపు ఓటింగ్‌కు రావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు.
వివరాలు
యూన్ సుక్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
ప్రతిపక్షాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, మంగళవారం సాయంత్రం యూన్ సుక్ యోల్ 'ఎమర్జెన్సీ మార్షల్ లా'ను (Emergency Martial Law) విధించారు.
దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో, యూన్ సుక్ తన ప్రకటనను వెనక్కి తీసుకున్నా, ప్రతిపక్షాలు ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా, పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం, స్పీకర్ మార్షల్ లా అమలు చట్ట విరుద్ధంగా ఉందని ప్రకటించారు.
ప్రస్తుతం, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినది.
మరోవైపు, యూన్ సుక్ యోల్ తన పదవిని వీడాలని, ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు.