'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ హమాస్ నేత హనియా ఇస్మాయిల్ హత్యకు సంబంధించిన ఫోన్ సంభాషణలో నన్ను మోసం చేయడాన్ని ఆపాలని జో బైడన్ వెల్లడించారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోందని, త్వరలో ఓ ప్రతినిధి బృందాన్ని పంపుతామని నెతన్యాహు చెప్పినప్పుడు జో బైడన్ ఆగ్రహించాడు.
ఇజ్రాయెల్ రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు
గత గురువారం అధ్యక్షుడు బైడన్, ప్రధాన మంత్రి నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా అధ్యక్షుడితో తన వ్యక్తిగత చర్చలపై ప్రధాని వ్యాఖ్యానించరని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ప్రధాన మంత్రి అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోరని, అదే విధంగా ఇజ్రాయెల్ రాజకీయాలలో అమెరికా కూడా జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.
అమెరికా
అమెరికాతో పాటు పలు దేశాలు కాల్పుల విరమణను సమర్థిస్తున్నాయి. అమెరికా, ఈజిప్ట్ సహా పలు దేశాలు గాజాలో కాల్పుల విరమణను సమర్థిస్తున్నాయి. గాజా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంతలో, ఇరాన్‌లో ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా కూడా హత్య కూడా గురయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.