LOADING...
Nepal: నేపాల్‌ పార్లమెంట్ రద్దు..  తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
నేపాల్‌ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

Nepal: నేపాల్‌ పార్లమెంట్ రద్దు..  తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
07:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. తాత్కాలిక ప్రధాన మంత్రి ఎవరు అవుతారన్నఉత్కంఠ వీడింది. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేసిన తరువాత, జన్‌ జడ్‌ ఉద్యమకారులు మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీలా కర్కీని తాత్కాలిక నాయకురాలిగా ఎంపిక చేశారు. ఆమె పేరును అధ్యక్షుడి ఆమోదానికి పంపారు. త్వరలోనే సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

వివరాలు 

ఎవరీ కర్కి..? 

సుశీలా కర్కీ(72)కి నేపాల్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.ఆమె ప్రారంభంలో ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత న్యాయవ్యవస్థలో ప్రవేశం చేశారు. నిర్భయంగా,సమర్థంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో చేరి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లోతాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత,రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు పూర్తిస్థాయి చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించి,నేపాల్‌లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. నేపాల్‌ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సుశీల కర్కి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా

సోషల్ మీడియా మీద నిషేధం విధించడాన్ని ప్రారంభమై,అవినీతికి వ్యతిరేకంగా సాగిన నేపాల్‌ ఆందోళనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ప్రధాన మంత్రి కేపీ శర్మ సహా అనేక మంది మంత్రులు తమ పదవుల నుండి రాజీనామాలు చేశారు. ఈ పరిస్థితిలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు జెనరేషన్-జెడ్ (Generation-Z) ఉద్యమకారులు చురుకైన పాత్ర పోషించారు. ఈ నాయకత్వ పోటీ లో, కాఠ్‌మాండూ మేయర్‌ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్‌ ఘీషింగ్‌ సహా అనేక మంది పేర్లు పరిశించినప్పటికీ.. చివరికి మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కి పై మొగ్గు చూపారు.