Hasina resignation: షేక్ హసీనా రాజీనామా లేఖపై ఉత్కంఠం.. బంగ్లాదేశలో మరోసారి నిరసనలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ లేఖపై అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉద్రిక్తతలు రేపుతున్నాయి. ప్రస్తుతం, ఆందోళనకారులు అధ్యక్ష భవనమైన 'బంగాభబన్'ను చుట్టుముట్టారు, వారు షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు షహాబుద్దీన్ కూడా వైదొలగాలని డిమాండు చేస్తున్నారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు విన్నానని, కానీ ఆ రాజీనామా లేఖ తనకు లభ్యం కాలేదని, ప్రస్తుతం తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని దేశాధ్యక్షుడు షహాబుద్దీన్ పేర్కొన్నారు. ఆయన ఈ విషయాన్ని సైన్యాధిపతితో కూడా పంచుకున్నారు.
అధ్యక్షుడి వ్యాఖ్యలతో మళ్లీ ఆందోళనలు
ఈ వ్యాఖ్యలు తాత్కాలిక ప్రభుత్వానికి అసహనాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఆసిఫ్ నజ్రుల్, ప్రస్తుత ప్రభుత్వ న్యాయ సలహాదారు వ్యాఖ్యలు చేయడంతో, అధ్యక్షుడు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు అట్టుడుకి దారితీసి, దాదాపు 300 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా తన అధికార నివాసాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అధ్యక్షుడు షహాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆందోళనలకు కారణమవుతున్నాయి.