USA: యుఎస్‌లో ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు.. 10 రోజుల్లో 2వ ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఒక ఆలయంలో కొంతమంది వ్యక్తులు విద్వేషపూరిత రాతలు (గ్రాఫిటీ) రాశారు.
ఇది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఉన్న బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరం (BAPS Shri Swaminarayan Mandir in California)లో జరిగింది.
ఆలయ అధికారులు ఈ ఘటనకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు రాసినట్లు తెలిపారు.
అలాగే, అక్కడి నీటి పైపులపై కూడా నష్టం తీసుకొచ్చారు. ఈ విద్వేషాలను ఎదుర్కొనడానికి శాంతి కోసం ప్రార్థనలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఇటువంటి సంఘటన గత పది రోజులలో ఇది రెండోసారి జరగడం గమనార్హం. అంతకుముందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద కూడా ఇలాంటి దాడులు జరిగాయి.
వివరాలు
ఆలయం వద్ద శాంతి, ఐక్యత కోసం ప్రార్థనలు
ఈ ఘటనపై శాక్రమెంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనను చూసి, హిందూ వర్గానికి చెందినవారు ఆలయం వద్ద చేరుకుని, శాంతి, ఐక్యత కోసం ప్రార్థనలలో పాల్గొన్నారు.
శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ అమెరికన్ చట్టసభ్యుడు అమిబెరా ఈ దుశ్చర్యను ఖండించారు,మత విద్వేషానికి స్థానం లేదని వ్యాఖ్యానించారు.
మరో కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా మాట్లాడుతూ, ఇలాంటి చర్యలు నైతికంగా తప్పని అన్నారు. దర్యాప్తు అధికారులకు చట్ట ప్రకారం బాధ్యులను జవాబుదారీ చేయాలని సూచించారు.