Page Loader
Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ద్వారా భారత్‌కు రూ.182 కోట్లు నిధులు కేటాయించారని, ఈ నిధులు ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు. భారత్‌కి అమెరికా నిధులు ఎందుకు? భారత్ ప్రపంచంలోని అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటిగా ఉందని, ఆ దేశానికి అమెరికా నిధులు ఎందుకు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నిధులను వినియోగించి ఉండొచ్చని చెప్పారు. ఇదే విషయంలో ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ ఈ నిధులను రద్దు చేయడాన్ని ట్రంప్ పూర్తిగా సమర్థించారు.

Details

 భారత ప్రభుత్వం స్పందన 

ట్రంప్ చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం ఉన్నదనే ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. USAID అనేది ప్రపంచ దేశాలకు సహాయం అందించే సంస్థ అయినప్పటికీ, దీని ద్వారా నిధులు దుర్వినియోగం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపించడం ఆలోచనీయమని అన్నారు.

Details

భారతీయ రాజకీయాల్లో మాటల యుద్ధం 

ఈ అంశంపై దేశ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, ప్రధాని మోదీ గతంలో చేసిన విదేశీ జోక్యం ఆరోపణలు నిజమని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరిస్తూ, అవి అసత్య ఆరోపణలేనని స్పష్టం చేసింది. అంతేకాక, USAID ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన నిధులపై కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఎన్నికలపై విదేశీ ప్రభావం? ట్రంప్ చేసిన ఆరోపణలతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ ప్రభావంపై కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై మరింత సమాచారం వెలువడితే రాజకీయ పరంగా దాని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.