Page Loader
Donald Trump: ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్‌ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!
ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్‌ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!

Donald Trump: ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్‌ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో దూకుడు పెంచారు. గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. తాజాగా ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ (డీఈఐ) సిబ్బందిని లేఆఫ్‌లతో విరమించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ట్రంప్‌ కార్యవర్గం ఒక మెమో జారీ చేసి, వారందరినీ సెలవులో ఉంచాలని ఆదేశించింది. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేస్తూ, ట్రంప్‌ తన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు.

Details

ఫెడరల్‌ సిబ్బంది సంఖ్యను తగ్గించే యోచనలో ట్రంప్‌ సర్కారు

అనంతరం సిబ్బంది నిర్వహణ కార్యాలయం విడుదల చేసిన మెమో ప్రకారం, డీఈఐ సిబ్బందిని బుధవారం సాయంత్రం 5 గంటలలోగా వేతనంతో కూడిన సెలవుపై పంపాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలిచ్చారు. ఈ విభాగాలకు సంబంధించిన అన్ని వెబ్‌పేజీలను కూడా ఈ గడువులోపు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను వెంటనే ముగించాలని ఏజెన్సీలను సూచించారు. ఈ విభాగాలు చేసిన ఒప్పందాలను కూడా రద్దు చేయాలని ఆదేశించారు. కొన్ని వెబ్‌సైట్లను ఇప్పటికే తొలగించారు. వచ్చే శుక్రవారంలో వీరికి లేఆఫ్‌లు ఇవ్వడం ద్వారా ఫెడరల్‌ సిబ్బంది సంఖ్యను తగ్గించే యోచనలో ట్రంప్‌ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోతపై నూతన అధ్యక్షుడి యంత్రాంగం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు.