
భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.
అమెరికా ప్రభుత్వానికి భారత వీసాల ప్రాసెస్ అనేది అత్యున్నత ప్రాధాన్యతగా మిల్లర్ పేర్కొన్నారు. ఇంకా చేయాల్సిన వీసాలు చాలానే ఉన్నాయని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ వచ్చే వారంలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే మోదీ పర్యటనలో దౌత్యం, ఇమ్మిగ్రేషన్, వీసా సమస్యలకు సంబంధించి అమెరికా నుంచి భారత్ భారతదేశం ఏమి ఆశించగలదని మాథ్యూ మిల్లర్‌ను విలేకరులు ప్రశ్నించగా ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.
అమెరికా
భారత్- అమెరికా మధ్య బలమైన సంబంధాలు: మిల్లర్
భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధంపై కూడా మిల్లర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇరు దేశాల మధ్య చాలా బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21-24 మధ్య అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ సెంటర్‌లో అమెరికా అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్‌లు, సీఈవోలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అలాగే మోదీ తన పర్యటనలో అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించనున్నారు.