Saudi Royal family : ప్రపంచ కుబేరులను మించిన సౌదీ రాజు కుటుంబం సంపద
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ సంపద నవంబర్ 2024 నాటికి బ్లూంబర్గ్ బిలియనైర్స్ ఇండెక్స్ ప్రకారం $313 బిలియన్లుగా ఉంది.
మరోవైపు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద ఫోర్బ్స్ నివేదిక ప్రకారం $105 బిలియన్లుగా ఉంది.
అయితే 'ఈ బిజినెస్ టైకూన్స్' నివేదిక ప్రకారం సౌదీ రాజ కుటుంబం సంపద ముందు వారి సంపాదన తక్కువగానే ఉంది.
సౌదీ అరేబియా రాజ కుటుంబం మొత్తం సంపద $1.4 ట్రిలియన్లుగా ఉందని యూకే పత్రిక ఎక్స్‌ప్రెస్ ధ్రువీకరించిది.
ఇది ప్రపంచ టాప్ బిలియనైర్స్ కలిపిన సంపద కంటే నాలుగు రెట్లు అధికంగా ఉంది. యూకే రాజు చార్లెస్ కుటుంబ సంపద కంటే 16 రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం.
Details
చమురు నిల్వలతోనే ఆదాయం
చార్లెస్ రాజు సంపద $772 మిలియన్లుగా ఉంది. ఆయన యూకేలో 258వ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రాపర్టీలు, సావోయ్ హోటల్, సోమర్సెట్ హౌస్, ఇతర ఆస్థుల ద్వారా బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ సంపద $88 బిలియన్లుగా ఉంది.
సౌదీ రాజ కుటుంబం ఈ స్థాయి సంపదకు కారణం వారి చమురు నిల్వలేనని నివేదిక చెబుతోంది.
సౌదీ రాజ కుటుంబంలో మొత్తం 15,000 మంది సభ్యులు ఉన్నా, వారిలో 2,000 మంది మాత్రమే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ఈ కుటుంబానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ రాజు 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' 2015 నుండి పాలనలో ఉన్నారు.
ఆయన కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్నారు.