
Justin Trudeau: వలసల విధానంలో దుర్వినియోగం జరిగింది.. ట్రూడో సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా వలస నియంత్రణ విధానంలో సమతౌల్యతను తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్పులు ప్రవేశపెట్టినట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
ఈ సందర్బంగా ఆయన 7 నిమిషాల వీడియో విడుదల చేసి, వలస విధానానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రసంగించారు.
అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల కోసం కెనడాలో ఉన్న అవకాశాలను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని ట్రూడో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు, పౌరసత్వం, డిప్లొమా కోర్సులు వంటి వాగ్దానాలతో అమాయకులను మోసం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
కెనడాలో తాత్కాలిక, శాశ్వత నివాసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నట్లు ట్రూడో తెలిపారు.
Details
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 10శాతం తగ్గింపు
2025-27 కాలానికి శాశ్వత నివాస పర్మిట్లను 21 శాతం, తాత్కాలిక నివాస పర్మిట్లను 2026 నాటికి 40శాతం మేర తగ్గించనున్నారు.
మరోవైపు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 10శాతం తగ్గిస్తామన్నారు. కొవిడ్ తర్వాత ఉద్యోగుల కొరతను తీర్చడానికి తీసుకున్న పాత వలస విధానాలు ఇప్పుడు సమస్యకు కారణమయ్యాయి.
వలస విధానంలో మార్పుల కారణంగా టొరంటో, వాంకోవర్ వంటి నగరాల్లో అద్దె ధరలు తగ్గుతున్నట్లు ట్రూడో వెల్లడించారు.
వలసలను నియంత్రించడంలో కెనడా కమ్యూనిటీల అవసరాలు, మౌలిక వసతుల విస్తరణను దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని ట్రూడో స్పష్టంగా చెప్పారు.
ఈ మార్పులు కెనడా వలస విధానానికి కొత్త దిశను చూపుతాయని తెలిపారు.