#NewsBytesExplainer: కెనడా విలీనం తరువాత వచ్చే సామాజిక, రాజకీయ సవాళ్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే పలు సంచలనాలకు తెరతీస్తున్నారు.
కెనడా, అమెరికాలో విలీనమైతే మెరుగంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చివరికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామాకు దారి తీశాయి.
కెనడా అమెరికాతో విలీనమైతే ఏమి జరుగుతుందో రాజకీయ నిపుణులు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడా విలీనం తరువాత అమెరికా, రష్యాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలవనుంది.
ఉత్తర అమెరికా ఖండంలో 80 శాతం భూభాగం, భూమ్మీద 13 శాతం ప్రాంతం అమెరికా పరిధిలోకి వస్తుంది.
Details
ఆర్థిక వ్యవస్థ రెండింతలు మించిపోయే అవకాశం
కెనడా జీడీపీ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది, కాబట్టి విలీనం తరువాత కెనడా అమెరికాలో మూడో అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా నిలుస్తుంది.
ప్రస్తుతం కాలిఫోర్నియా, టెక్సాస్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విలీనం తరువాత అమెరికా ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుంది.
ఇది ప్రస్తుతం 17.79 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను దాదాపు రెండింతలు మించిపోతుంది.
కెనడా విలీనం తరువాత, అమెరికా ఉత్తర ధృవంపై మరింత ప్రభావం చూపిస్తుంది. కెనడాలోని లక్ష మంది సైన్యం ద్వారా, అమెరికా ఆర్కిటిక్ ప్రాంతంలోని నార్త్‌వెస్ట్ ప్యాసెజ్‌పై ఆధిపత్యం సాధిస్తుంది.
Details
విలీనం తరువాత జనాభా 380 మిలియన్లకు చేరే అవకాశం
కెనడాలోని సహజ వనరులు, మంచినీటి నిల్వలు, ప్రపంచంలో 13 శాతంగా ఉన్న చమురు నిల్వలు, అమెరికా భాగం అవుతాయి. అమెరికా చమురు నిల్వలు 215 బిలియన్ బారెల్స్‌కు చేరుకుంటాయి.
ఇది రష్యా (100 బిలియన్ బారెల్స్), ఇరాక్ (145 బిలియన్ బారెల్స్), ఇరాన్ (208 బిలియన్ బారెల్స్) సౌదీ అరేబియా (267 బిలియన్ బారెల్స్) ను మించిపోతుంది.
కెనడా జనాభా విలీనం తరువాత అమెరికా జనాభా 380 మిలియన్లకు చేరుకుంటుంది.
Details
ఇరు దేశాల మధ్య రాజకీయ వ్యత్సాసాల తేడా
అయితే ఈ విలీనం అసాధ్యం అన్న అభిప్రాయం కూడా ఉంది.
ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వ్యత్యాసాలను అధిగమించడం పెద్ద సమస్యగా మారుతుంది.
అంతేకాక గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, ఒడంబడికలు కూడా ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయి.