Page Loader
Year Ender 2024 : ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కీలక ఎన్నికలు
ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కీలక ఎన్నికలు

Year Ender 2024 : ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కీలక ఎన్నికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 సంవత్సరం ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన ఎన్నికల సంఘటనలు చోటుచేసుకున్న ఏ సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. అమెరికా నుంచి భారత్‌ వరకు 73 దేశాలు తమ ఎన్నికలు నిర్వహించాయి. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు కూడా ఈ సంఖ్యలో భాగం. ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పైగా జనాభా నివసిస్తున్నది. ప్రపంచ జనాభాలో సగం పైగా ప్రజలు ఈ ఏడాది ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష లేదా పరోక్షంగా పాల్గొన్నారు. అమెరికా ఎన్నికలు అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయాయి. ట్రంప్ రెండోసారి 'అమెరికా ఫస్ట్' నినాదం ద్వారా 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, అధ్యక్షుడిగా పదవీ చేపట్టారు

Details

 భారత ఎన్నికలు

భారతదేశంలో సాధారణ ఎన్నికలు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక కార్యక్రమంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ పార్టీ 400కి పైగా సీట్లను గెలుచుకోడానికి సన్నద్ధం అయినా చివరికి 240 సీట్లతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌లో రిషి సునాక్‌ ఓటమి బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలనను ముగించి, లేబర్ పార్టీ విజయం సాధించింది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొంది. పాకిస్తాన్‌ ఎన్నికలు పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికలు వివాదాస్పదంగా నిలిచాయి. షహబాజ్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో పీఎంఎల్-ఎన్‌కు పెద్ద ఫలితం లేకపోయినప్పటికీ, పీటీఐ పార్టీ స్వతంత్రంగా ఎక్కువ సీట్లు గెల్చుకుంది.

Details

 శ్రీలంక ఎన్నికలు 

శ్రీలంకలో నవంబర్‌లో జరిగిన ఎన్నికలు వామపక్ష నేత అనూర కుమార దిస్సనాయక్‌ విజయం సాధించి, రాజపక్స కుటుంబానికి రాజకీయంగా ఓటమి కొట్టింది. రష్యా ఎన్నికలు రష్యాలో పుతిన్‌ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఈసారి 87 శాతం ఓట్లతో విజయం సాధించారు. విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు అనుమానాస్పదంగా మరణించడం కూడా పెద్ద దుమారాన్ని రేపింది. బంగ్లాదేశ్ ఎన్నికలు బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది సంక్షోభం సృష్టించుకుంది. షేక్ హసీనా ఐదోసారి ప్రధాని అయినా కొన్ని నెలల తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు.

Details

 సిరియా 

సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ కుటుంబ పాలనకు డిసెంబరులో తెర పడింది. 50 సంవత్సరాల తర్వాత, ఈ కుటుంబం పారిపోయి, సిరియా అనిశ్చితిలో కూరుకుపోయింది. 2024 ఏటా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఆశ్చర్యకరమైన, విశేషమైన ఎన్నికలు ప్రతి దేశంలో కొత్త పరిణామాలు తీసుకువచ్చాయి.