Us Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ 7 రాష్ట్రాలు కీలకం.. ఎందుకంటే?
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు మరిన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీటిని "స్వింగ్ స్టేట్స్" అంటారు. తటస్థ ఓటర్లకు అధికంగా ఉండడం వల్ల అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పగలిగే ఈ "స్వింగ్ స్టేట్స్" జాబితాలో అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, స్వింగ్ స్టేట్స్‌లో విజయాన్ని సాధించేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
స్వింగ్ స్టేట్స్ లో నాయకత్వ పోరు
అరిజోనా: మెక్సికోతో సరిహద్దు ఉన్న ఈ రాష్ట్రం గతంలో రిపబ్లికన్లకు ప్రాముఖ్య కేంద్రమైంది. కానీ, లాటిన్ ఓటర్ల పెరుగుదల, కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్ మద్దతుదారుల వలసల కారణంగా ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. జార్జియా: 1992 నుంచి డెమోక్రటిక్ అభ్యర్థులకే ఓటు వేయని జార్జియా, 2020లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గుచూపింది. 33% ఆఫ్రో-అమెరికన్ ఓటర్లు కమలా హారిస్‌కు సహాయపడవచ్చని భావిస్తున్నారు. మిషిగన్: అరబ్-అమెరికన్లు అధికంగా ఉండే ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు బలమైన కేంద్రంగా ఉంది. కానీ, ఇటీవల గాజా-పాలస్తీనా పరిస్థితుల కారణంగా డెమోక్రట్లపై అసంతృప్తి పెరుగుతోంది. నెవాడా: 2004 నుంచి రిపబ్లికన్ వైపు మొగ్గు చూపని ఈ రాష్ట్రం, హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో మార్పు సాధించగలమని రిపబ్లికన్లు ఆశిస్తున్నారు.
స్వింగ్ స్టేట్స్ లో నాయకత్వ పోరు
నార్త్ కరోలినా: 2016, 2020 ఎన్నికల్లో ట్రంప్ వైపున ఉన్న ఈ రాష్ట్రంలో ఆఫ్రో-అమెరికన్ ఓటర్లు 22% ఉండటం హారిస్‌కు సహాయపడవచ్చని భావిస్తున్నారు. పెన్సిల్వేనియా: డెమోక్రాట్లకు కంచుకోటగా భావించిన ఈ రాష్ట్రంలో రిపబ్లికన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 100 బిలియన్ డాలర్ల పరిశ్రమలను ప్రారంభిస్తామని హారిస్ హామీ ఇచ్చారు. విస్కాన్సిన్: 2016లో ట్రంప్ విజయం సాధించిన ఈ రాష్ట్రంలో మూడో పార్టీ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పోటీ నుంచి తప్పుకోవడంతో ట్రంప్ గెలుపు సాధించే అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.