Three indians arrested-Nijjar Assiniation: నిజ్జార్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన కెనడా పోలీసులు
ఖలిస్థాన్ (Khalisthan)వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardip singh Nijjar)ను గత ఏడాది సర్రేలో హతమార్చేందుకు పనిచేసిన బృందంలోని ముగ్గురిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో సంబంధం ఉన్న టీమ్లోని కరణ్‌ప్రీత్ సింగ్, 28, కమల్‌ప్రీత్ సింగ్, 22 మరియు కరణ్ బ్రార్, 22 అనే ముగ్గురు వ్యక్తుల్ని కెనడాలోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరికి భారత ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్సీఎంపీ సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్ మీడియాకు తెలిపారు. నిజ్జార్ హత్య కేసులో కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు కొద్ది నెలలుగా వారిపై పూర్తి నిఘా పెట్టారు.
భారతీ ఏజెంట్ల ప్రమేయం గురించి గతంలోనే ప్రస్తావించిన కెనడా ప్రధాని ట్రూడో
నిజ్జర్ హత్య సమయంలో ఈ ముగ్గురు షూటింగ్, డ్రైవర్,స్పాటర్‌లుగా వివిధ పాత్రలు పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, టొరంటోలో జరిగిన ఖాల్సా డే కార్యక్రమంలో మాట్లాడుతూ, నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ట్రూడో లేవనెత్తిన 'ఖలిస్తాన్' అనుకూల నినాదాలపై కెనడియన్ డిప్యూటీ హైకమిషనర్‌ను కూడా పిలిపించి భారత్ అధికారికంగా నిరసన తెలిపింది.