Page Loader
Justin Trudeau: దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ  ఆసక్తికర పరిణామం
దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ ఆసక్తికర పరిణామం

Justin Trudeau: దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ  ఆసక్తికర పరిణామం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఆ విశేషాలు పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం, కెనడా మధ్య ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వేడుకలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రూడో తన పోస్టులో "హ్యాపీ దీపావళి. ఈ వారం వారితో సంబరాలు జరుపుకున్నాను. ప్రత్యేక క్షణాలను ఆస్వాదించాను" అని పేర్కొన్నారు. ఆయన చేతిలో మతపరమైన తాళ్లు ఉండగా, వాటి గురించి వీడియోలో వెల్లడించారు.

వివరాలు 

ట్రూడో పోస్టులో దీపావళి సంబరాల దృశ్యాలు

కెనడాలోని మూడు హిందూ దేవాలయాలను సందర్శించినట్లు ట్రూడో తెలిపారు. "ఈ తాళ్లు అదృష్టం, రక్షణను ఇస్తాయి. అవి తెగిపోయే వరకు నేను వీటిని తొలగించను" అని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా, ట్రూడో పోస్టులో దీపావళి సంబరాల దృశ్యాలను కూడా జత చేశారు. గతంలో ఆయన దీపావళి సందేశంలో "ఇండో-కెనడా కమ్యూనిటీ లేకపోతే, ఈ దేశంలో దీపావళి సాధ్యం కాదు. వారు ఆర్టిస్టులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, టీచర్లు, నాయకులుగా కెనడాలో అత్యుత్తమమైన వారు" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

వైట్‌బైలో నిర్వహించిన కార్యక్రమంలో..  భారీ సంఖ్యలో భారతీయులు 

ఇంకొకవైపు, భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం కూడా తొలుత ఈ వేడుకలకు దూరంగా ఉంది. ది ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కెనడా (ఓఎఫ్ఐసీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ హాల్‌లో నిర్వహించడానికి ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలకు ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే హాజరుకాని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆయన కార్యాలయం స్పందిస్తూ త్వరలోనే వేడుకలకు పాల్గొంటానని తెలియజేసింది. ఈ క్రమంలో, ఆయన వైట్‌బైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇందులో భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జస్టిన్ ట్రూడో చేసిన ట్వీట్