Trudeau: అమెరికా, కెనడా సరిహద్దులో భద్రత కట్టుదిటానికి ట్రంప్‌కు ట్రూడో హామీ
కెనడా,అమెరికా సరిహద్దు ప్రాంతంలో కెనడా వైపు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పరిణామంలో, అదనపు డ్రోన్లు, హెలికాప్టర్లు,సిబ్బంది మోహరించాలని వారు నిర్ణయించారని వెల్లడించారు. ఇటీవల, ట్రంప్, కెనడా,మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ట్రూడో, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వారు ఈ నిర్ణయానికి రావటానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
చైనాపై కూడా 10 శాతం సుంకం
కెనడా,తన దేశంలో తయారయ్యే ఉత్పత్తులలో 75 శాతం అమెరికాకు పంపించి భారీ లాభాలు పొందుతున్నది. గతంలో,ట్రంప్, అక్రమ వలసదారులను, డ్రగ్స్‌ను కెనడా నుండి అడ్డుకోవాలని హెచ్చరించారు, లేదంటే కెనడా పై భారీ సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం కెనడా ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాన్ని కలిగి ఉంది.దీంతో కెనడా ప్రధాని ట్రూడో, ట్రంప్‌తో సమావేశానికి రాగా, వాణిజ్య, వలస మరియు డ్రగ్స్ సంబంధిత అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ట్రంప్,కెనడా,మెక్సికో నుండి వస్తువులపై 25శాతం సుంకం విధించాలనే తన నిర్ణయాన్ని మరింత బలపరిచారు. ట్రంప్,చైనాపై కూడా 10 శాతం సుంకం విధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రారంభంలో, కెనడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో,చివరికి వారు ఈ నిర్ణయాన్ని అంగీకరించారు.