Canada: ట్రూడో రాజీనామా.. కెనడా ప్రధాని పదవికి భారత సంతతి నేతల పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకటించారు.
ఆయన లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించారు. దీంతో కెనడాలో తదుపరి ప్రధాని ఎవరు అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
ఈ సందర్భంగా, జస్టిన్ ట్రూడో సోమవారం మీడియాతో మాట్లాడారు. కొత్త నాయకుడు పార్టీకి ఎన్నికైన తర్వాత, తాను పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నానని తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత, లిబరల్ పార్టీ తాజా నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో నిమగ్నమైంది.
Details
రేసులో పలువురు ఎంపీలు
ప్రధాని పదవికి పోటీలో కెనడాలో లిబరల్ పార్టీ నేతలుగా క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ ఉన్నారు.
అందులో భారత సంతతి నేతలుగా అనితా ఆనంద్, జార్జ్ చాహల్ కూడా జాబితాలో ఉన్నాయి.
Details
అనితా ఆనంద్
తమిళ్, పంజాబీ మూలాలున్న 57 సంవత్సరాల అనితా ఆనంద్ ఆక్స్‌ఫర్డ్ లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే, ట్రూడో క్యాబినెట్‌లో ఆమెకు చోటు దక్కింది.
ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జార్జ్ చాహల్
భారత సంతతికి చెందిన జార్జ్ చాహల్ ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన సహజ వనరులపై స్థాపించిన స్టాండింగ్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.
అయితే లిబరల్ పార్టీ నిబంధనల ప్రకారం తాత్కాలిక నాయకులు ప్రధాని పదవికి అర్హత కలిగివుండరు.