
Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి వాణిజ్య యుద్ధంపై ఊహాగానాలకు ఆజ్యాన్ని మరింత పెంచారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు.
అంతేకాక అమెరికాలో తయారుకాని అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ఆపిల్ ఐఫోన్‌లపై 25 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడింది. ట్రంప్ మాటలతో గ్లోబల్ ట్రేడ్‌లో అనిశ్చితి మళ్లీ పెరిగింది. ఆయన EUపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వారితో జరిగిన వాణిజ్య చర్చలు విఫలమయ్యాయని వెల్లడించారు.
EU అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్, అమెరికన్ ఉత్పత్తులపై యూరప్‌లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
Details
ఆపిల్‌కు ఘాటు హెచ్చరిక - ట్రంప్ వార్నింగ్
ఆపిల్ కంపెనీకి గట్టి సందేశం పంపిన ట్రంప్, ఐఫోన్‌లను అమెరికాలో తయారు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే ఆపిల్ కొత్తగా విధించబోయే 25 శాతం సుంకాలను భరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇప్పటికే టిమ్ కుక్‌తో తాను ఈ విషయంలో మాట్లాడినట్టు గుర్తుచేసిన ట్రంప్, "భారతదేశంలో ప్లాంట్ నిర్మిస్తున్నామన్నా, అమెరికాలో అమ్మాలంటే అక్కడే తయారీ జరగాలని తేల్చిచెప్పారు.
ఈ హెచ్చరికలతో ఆపిల్ కంపెనీ షేర్లు 3 శాతం మేర క్షీణించాయి.
ప్రస్తుతం చైనా సుంకాల భారాన్ని తగ్గించేందుకు ఆపిల్ ఐఫోన్ అసెంబ్లీపై భారత్‌పై దృష్టి సారించినప్పటికీ, ట్రంప్ తాజా నిర్ణయాలు కంపెనీ వ్యూహాలను తిరగరాయే అవకాశముంది.
అమెరికాలో తయారీకి వెళ్తే, ఐఫోన్ ధరలు వందల నుంచి వేల డాలర్లు పెరిగే అవకాశముందని నిపుణుల విశ్లేషణ.
Details
ఇతర బ్రాండ్‌లపై ప్రభావం
ట్రంప్ ప్రకటన ప్రకారం, జూన్ చివరి నాటికి ఆపిల్‌తో పాటు శామ్‌సంగ్ వంటి ఇతర విదేశీ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా 25 శాతం సుంకం విధించే అవకాశం ఉందని వెల్లడించారు.
యూరోప్ దిగుమతులపై 50 శాతం
సుంకం గత సంవత్సరం EU అమెరికాకు $500 బిలియన్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో ప్రధానంగా జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ దేశాలు ముందున్నాయి.
కార్లు, ఔషధాలు, విమానాలు వంటి రంగాలపై 50 శాతం దిగుమతి సుంకం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ సుంకాలు అమెరికన్ వినియోగదారుల ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాలతో అమెరికా-యూరోప్ వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.