Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
వివరాలు
తక్షణమే అమలులోకి వచ్చే అవకాశాలు లేవు
''విదేశీ వాణిజ్యంలో సమానత్వాన్ని కాపాడేందుకు ప్రతీకార సుంకాలు విధించాల్సిన అవసరం ఉంది. అంటే, అమెరికా దిగుమతులపై ఏ దేశం సుంకాలు విధించినా,మేము కూడా అదే దేశంపై అదే స్థాయిలో సుంకాలు విధిస్తాం. ఎవరైనా అధికంగా లేదా తక్కువగా సుంకాలు విధించినా, మా నిర్ణయం ఆ దేశం విధించిన స్థాయికే పరిమితం అవుతుంది,'' అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం కార్యనిర్వాహక చర్య ద్వారా తీసుకున్నప్పటికీ, తక్షణమే అమలులోకి వచ్చే అవకాశాలు లేవు.
అయితే, ట్రంప్ ఆర్థిక బృందం పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత కొన్ని వారాల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది.