Page Loader
Kamala Harris-Donald Trump: కమలా హారిస్‌ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు .. CBS న్యూస్‌ మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు
కమలా హారిస్‌ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు

Kamala Harris-Donald Trump: కమలా హారిస్‌ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు .. CBS న్యూస్‌ మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రతి అభ్యర్థి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఇంటర్వ్యూ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇటీవల ఒక మీడియా సంస్థ 'సీబీఎస్‌' పై ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖలో కమలా హారిస్ ఇంటర్వ్యూ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ను ఎడిట్ చేయకుండా ఒరిజినల్‌గా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్‌ ఆ పని చేయకపోతే, న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

వివరాలు 

ఇది ఓటర్లను మోసం చేసే ప్రయత్నం

ట్రంప్ తన లేఖలో, కమలా హారిస్ సామర్థ్యాన్ని, తెలివితేటలను గందరగోళం సృష్టించేలా ఎడిట్ చేసి, ప్రజలకు తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపించారు. "ఇది ఓటర్లను మోసం చేసే ప్రయత్నం" అని ట్రంప్ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సీబీఎస్‌ మీడియా సంస్థ ట్రంప్ చేసిన ఆరోపణలను త్రోసి పుచ్చింది.