US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ తన చివరి ప్రత్యర్థి నిక్కీ హేలీపై విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న ప్రాంతాల్లో ట్రంప్‌కు మంచి మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా గెలుపుతో ట్రంప్ వరుసగా నాలుగో రాష్ట్రంలో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీలోని అన్ని వర్గాల వారు ట్రంప్‌కు ఎక్కువ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు ట్రంప్‌కు అండగా నిలుస్తున్నారు. సౌత్ కరోలినాలో విజయం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. ఈ గెలుపు అద్భుతమైనదన్నారు.
హేలీ ఏమన్నారంటే?
నిక్కీ హేలీ ప్రస్తుతం సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె సొంత రాష్ట్రంలోనే హేలీ ఓడిపోవడం గమనార్హం. ట్రంప్ విజయం తర్వాత నిక్కీ హేలీ మాట్లాడారు. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో జో బైడెన్‌ను ట్రంప్ ఓడించలేకపోయారన్నారు. ప్రైమరీ ఎన్నికల్లో తాను వరుసగా 4 చోట్ల ఓడిపోయినప్పటికీ తన ప్రచారాన్ని కొనసాగిస్తానని, రేసు నుండి తప్పుకోనని హేలీ అన్నారు. ఇప్పటికే అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్, బిడెన్ మధ్య పోటీ నెలకొనడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.