
Donald Trump: యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే (UK)పర్యటనలో ఉన్న సమయంలో ఒక చేదు పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ లండన్‌కి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కొంతమంది వ్యక్తులు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న ఆయన ఫొటోల్ని ప్రదర్శించారు. ఆ ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రంప్, ఆయన భార్య మెలానియా మంగళవారం(స్థానిక కాలమానం ప్రకారం)లండన్‌కు చేరుకున్నారు. వీరికి బ్రిటన్ రాజు చార్లెస్ III (King Charles III)ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాయల్ విండ్సర్ కోటలో ఆయన బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న ఫొటోలు, కేసుకు సంబంధించిన వీడియోలను ఈ భవనం పై కొందరు ప్రదర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఆ ప్రదర్శనను నిలిపివేసింది.
వివరాలు
'లెడ్ బై డాంకీస్'ఈ వైరల్ స్టంట్‌లకు భాద్యత తీసుకుంది
ప్రదర్శనలో పాల్గొన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ స్టంట్‌కి 'Led By Donkeys'అనే రాజకీయ విమర్శనాత్మక గ్రూప్ బాధ్యత వహించినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ట్రంప్,జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సన్నిహిత సంబంధాలపై ప్రచారం జరిగింది. 1990-2000 మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్క పక్క నివాసాల్లో ఉండేవారు.
వివరాలు
జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఎప్‌స్టీన్
దీనిపై గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ''15 ఏళ్లుగా ఎప్‌స్టీన్ తెలుసు. అతను అద్భుతమైన వ్యక్తి, అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు'' అని తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత ఎప్‌స్టీన్, ట్రంప్‌ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు రావడంతో 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అదే ఏడాది ఆగస్టులో జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.