
Donald Trump: కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా, భారత్, పాక్‌లతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుత ఉద్రిక్తత వల్ల మానవీయ నష్టం తప్ప మరెక్కడా ప్రయోజనం లేదు.
ఈ వాస్తవాన్ని భారత్, పాకిస్తాన్ నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. లక్షలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
Details
అమెరికా తరుఫున సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా
ఈ సమయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే దిశగా మీరు ముందడుగు వేసినందుకు అమెరికా తరఫున సాయం చేసినందుకు నేను గర్వపడుతున్నాను.
చర్చలు మాత్రమే కాదు, వాణిజ్య సంబంధాల పరంగా కూడా రెండు దేశాలతో మేము మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం.
మీరు కశ్మీర్‌పై శాశ్వత పరిష్కారానికి చేరగలిగితే, మీతో కలిసి పనిచేయడానికే నేను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు.
Details
ట్రంప్ పాత్రపై ఎలాంటి ప్రస్తావన లేదు
ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనూ ఇదే అంశంపై ఆయన ఆసక్తి చూపారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధంగా ఉందని అప్పటి భారత్, పాక్ ప్రధానులతో ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే, భారత్ ప్రభుత్వం మాత్రం మూడో పక్ష జోక్యం అనవసరమని తేల్చేసింది. దీంతో ఆ వ్యవహారంపై ట్రంప్ తర్వాత పెద్దగా స్పందించలేదు.
ఇక తాజాగా, భారత్, పాక్‌లు కాల్పుల విరమణ ఒప్పందంపై అవగాహనకు వచ్చాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ముందుగా వెల్లడించారు.
ఆ తర్వాత రెండు దేశాలు అధికారిక ప్రకటనలు వెలువరించాయి. అయితే, భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ట్రంప్ పాత్రపై ఎలాంటి ప్రస్తావన లేదు.