
Trump: చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి.. సున్నాకు మాత్రం రావు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా తయారీ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
అందుకు ప్రతిగా చైనా తీసుకున్న చర్యల నేపథ్యంలో, ఆ దేశ ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది.
ఈ పరిణామాలతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు భారీగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
అయితే పూర్తి మాఫీ జరగదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చైనాతో జరగనున్న చర్చల్లో, బీజింగ్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు తాను యత్నిస్తానని తెలిపారు.
వివరాలు
ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా మార్కెట్లో స్థానం పొందాలని ఆసక్తి
అయితే గతంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న అమెరికా వాణిజ్య విధానాన్ని చైనా దెబ్బతీసిందని ఆరోపిస్తూ, ఇప్పుడు డ్రాగన్ దేశం తమతో ఒక సరైన ఒప్పందానికి అంగీకరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రస్తుతం చైనాతో సాగుతున్న వాణిజ్య చర్చలు సమర్థవంతంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా మార్కెట్లో స్థానం పొందాలని ఆసక్తి చూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనాతో ఒక మంచి ఒప్పందం కుదుర్చుకోవాలని తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఇదే విషయంపై అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా స్పందిస్తూ, చైనాపై ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాల్లో కొన్ని కోతలు రావచ్చన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు.