Page Loader
Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?
డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?

Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురానున్న కీలక పాలసీపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన డోజ్‌ నుంచి వైదొలిగినట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మస్క్ ఇప్పుడు మాత్రం ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై విమర్శలు గుప్పించడం విశేషం. ట్రంప్ ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్న "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్" (OBBBA)కు ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇది సెనేట్ సమీక్షకు చేరుకుంది. ట్రిలియన్ల డాలర్ల పన్ను కోతలు, మిలటరీపై భారీ వ్యయాలు వంటి అంశాలు ఇందులో ఉండగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ట్రంప్ ఈ బిల్లును తీసుకువచ్చారు.

Details

ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం

అయితే ఈ బిల్లుపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమలులోకి వస్తే ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ఇది పూర్తిగా డోజ్‌ ఆశయాలకు విరుద్ధంగా మారుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. డోజ్ ఇప్పటికే ఖర్చులను తగ్గించేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. కానీ ట్రంప్ బిల్లుతో ఆ ప్రయత్నాలన్నీ నీరుగారతాయని మస్క్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ బిల్లు చట్టబద్ధమైతే అమెరికా ఖర్చులు ఆదాయాన్ని మించి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అప్పు మరో \$600 బిలియన్ల మేర పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.