LOADING...
TikTok: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్‌ కీలక నిర్ణయం
టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్‌ కీలక నిర్ణయం

TikTok: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

టిక్‌ టాక్‌ కొనుగోలుపై వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ట్రంప్‌ 'సావరిన్‌ వెల్త్‌ఫండ్‌'ను సృష్టించాలని ఆదేశించారు. ఈ ప్రకటనతో సంబంధించి, అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ను ఏర్పాటు చేసి, టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని ఉందని ట్రంప్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ యూఎస్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ను రూపొందించాలని సూచించారు. ఈ ఫండ్‌ ద్వారా టారిఫ్‌లు, ఇతర విధానాలతో హైవేలు, విమానాశ్రయాలు, తయారీ, వైద్య పరిశోధన వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామని చెప్పారు.

Details

50శాతం వాటా ఇస్తేనే ఆమోదిస్తాం

అయితే ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు దేశ బడ్జెట్‌లోని మిగులుపై ఆధారపడాల్సి ఉంటుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా టిక్‌టాక్‌ వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లులో చైనా యాజమాన్యాన్ని వదలకపోతే టిక్‌టాక్‌ను నిషేధించే విధంగా సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్‌ ఇచ్చింది. ట్రంప్‌ తన అధికారంలోకి వచ్చిన తర్వాత, 75 రోజుల్లో టిక్‌టాక్‌ అమ్ముకోవాలని ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ సమయంలో జాయింట్‌ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే, ఈ వ్యాపారం ఆమోదిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.