LOADING...
USA-China: ట్రంప్‌ సుంకాలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు 
ట్రంప్‌ సుంకాలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు

USA-China: ట్రంప్‌ సుంకాలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయం పెంచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇతర దేశాలపై కొరడా ఝలిపిస్తే.. ఆ దెబ్బ అమెరికా కంపెనీలకే తగులుతోంది. ముఖ్యంగా చైనా నుండి కార్యకలాపాలను నిర్వహిస్తున్న మెజారిటీ కంపెనీలు ఈ ప్రభావాన్ని గమనిస్తున్నాయి. వాషింగ్టన్‌ ప్రభుత్వం చైనా నుండి వచ్చే వస్తువులపై ఎక్కువ సుంకాలు వసూలు చేయాలని భావించగా, బీజింగ్‌ కూడా తాము తక్కువ తినలేదని ప్రతీకారంగా అదనపు సుంకాలను విధించింది. దీంతో ప్రధానంగా అమెరికా కంపెనీలే ఈ సంక్షోభానికి గురవుతున్నట్లు షాంఘైలోని అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది.

వివరాలు 

సర్వేలో మొత్తం 254 కంపెనీల్లో మూడోవంతు పాల్గొన్నాయి

ఈ సర్వేలో మొత్తం 254 కంపెనీల్లో మూడోవంతు పాల్గొన్నాయి. చైనాలో కొత్త సుంకాల వల్ల తాము అంచనా వేసిన ఆదాయం తగ్గుతుందని అవి పేర్కొన్నాయి. చైనా లో కొత్తగా విధించిన సుంకాల కారణంగా తాము అంచనా వేసిన ఆదాయం తగ్గిపోతుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అయితే, కొన్ని బ్యాంకింగ్‌ రంగ సంస్థలు,ఇతర కొన్ని పరిశ్రమలు అమెరికాకు ఎగుమతులు, దిగుమతులు చేయడం లేదని కూడా సర్వేలో వెల్లడైంది. అలాంటి కంపెనీల సంఖ్య సుమారు మూడింట ఒకటి ఉండడం గమనార్హం. ఈ సంస్థలపై మాత్రమే టారిఫ్‌లు వర్తించవు. ప్రధానంగా, ట్రంప్‌ చైనా దిగుమతులపై మొదట 30 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆపై ఆ శాతం 145 శాతానికి పెంచారు.

వివరాలు 

సుంకాలు మా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి

దీనిపై చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించడంతో పరస్పర సుంకాలపై వెనక్కి తగ్గాలనే నిర్ణయం మే నెలలో రెండు దేశాధినేతలు తీసుకున్నారు. ఫలితంగా, చైనా 10 శాతం సుంకాలతో సరిపెట్టింది ఈ నూతన టారిఫ్‌లు ముఖ్యంగా చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు చేసే సంస్థలతో పాటు, కొన్ని రకాల ముడిసరుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సంస్థలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమ సంస్థలు ఈ ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నట్లు షాంఘై ఛాంబర్‌ నాయకులు తెలిపారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఎరిక్‌ షెంగ్‌ "సుంకాలు మా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి" అని స్పష్టం చేశారు.

వివరాలు 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్‌ యంత్రాంగం

కొంతకాలంగా అమెరికా, చైనా వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, సుంకాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై ఎలాంటి స్పష్టత లేదు. భవిష్యత్ వ్యూహాలు రూపొందించుకోవాల్సిన కంపెనీలకీ ఈ అనిశ్చితి ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని జెంగ్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు, అత్యవసర చట్టాల ఆధారంగా సుంకాలు విధిస్తున్నప్పటికీ, అనేక కోర్టులు ట్రంప్‌కి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులపై అమెరికా అధ్యక్షుడి యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.