Page Loader
#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?
గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?

#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. ఈ రెండు ప్రాంతాలు అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి సైనిక లేదా ఆర్థిక శక్తిని ఉపయోగించడంపై అడిగిన ప్రశ్నకు 'రెండూ కాదు' అని సమాధానమిచ్చారు. అయితే ఇవి ఆర్థిక భద్రత కోసం మనకు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ విషయంలో బేరమాడే ప్రయత్నంలో భాగంగానే మాట్లాడుతున్నారా అనే విషయంపై స్పష్టత లేదు.

Details

ప్రతిపాదనను తిరస్కరించిన డెన్మార్క్

గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువలను వదిలిపెట్టాలనుకున్న ప్రతిపాదనలకు పనామా, డెన్మార్క్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కెనడాను అమెరికాలో కలుపుకోవాలని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. కెనడా కూడా అమెరికా రాష్ట్రంలా ఉండాలని ఆయన అన్నారు. అయితే దీనికి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రెండు దేశాలు కలవడానికి ఎటువంటి అవకాశమూ లేదని వెల్లడించారు. అంతేకాదు ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని సూచించారు. విండ్ పవర్‌పై తన వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశారు. ట్రంప్ జూనియర్ గ్రీన్‌ల్యాండ్‌ను సందర్శిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్‌ల్యాండ్ అతి కీలకమైన భూభాగమని ట్రంప్ చెబుతున్నారు.

Details

ట్రంప్ విషయంలో సీరియస్ గా ఉన్న కెనడా

ఇక్కడ ప్రస్తుతానికి భారీ ఖనిజ వనరులు, అలాగే అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన కేంద్రాలున్నాయి. చైనా, రష్యా నౌకలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని, అందుకే ఈ ప్రాంతం అమెరికాకు చాలా కీలకమని ఆయన అన్నారు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో పనామా కాలువను అమెరికా స్వాధీనంలో ఉంచినా 1977లో జిమ్మీ కార్టర్ అధ్యక్షతన కుదిరిన ఒప్పందంతో ఈ భూభాగం పనామాకు అప్పగించారు. ట్రంప్ ఈ ఒప్పందాన్ని తప్పిదంగా అభివర్ణించారు. కెనడా విషయంలో ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు అనిపించినా దీనిపై సమగ్రమైన స్పష్టత లేదు.