
Donald Trump: భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: దెబ్బకు దిగి వచ్చిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
టారిఫ్ లకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకు మారుతోంది. తాజాగా, ఆయన తమ స్వంత సోషల్ మీడియా వేదికగా "ట్రూత్" ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా,భారత్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉండే అడ్డంకులను తొలగించేందుకు ఆయన పరిపాలన వ్యవస్థ ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చల ద్వారా రెండు మహా దేశాలకు గొప్ప ఫలితాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రూత్ లో ట్రంప్ చేసిన పోస్ట్
BREAKING: Trump is pleased to announce… pic.twitter.com/Zm7gPz3vRQ
— Shiv Aroor (@ShivAroor) September 10, 2025
వివరాలు
భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైంది: ట్రంప్
రష్యా నుంచి భారీ స్థాయిలో భారత్ చమురును దిగుమతి చేసి,దానిని విదేశాలకు అమ్మడం నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీలు నిర్వహించారు. ఈ భేటీల అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. అయితే,కొన్ని గంటల్లోనే స్వరం మార్చిన ఆయన, భారత్,అమెరికా మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ గొప్ప నాయకుడిగా పేర్కొన్నారు. మోదీ వ్యక్తిగతంగా తన స్నేహితుడని తెలిపారు.