Page Loader
Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌ 
బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడ్డారని ఇటీవలే వెల్లడైంది. ఈ విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.క్యాన్సర్‌ విషయం ఆలస్యంగా బయటకు రావడాన్ని ఆయన ప్రశ్నించారు. ''బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్నవిషయం చాలారోజుల తర్వాత తెలిసింది.ఇది ఆశ్చర్యంగా ఉంది.గ్లీసన్‌ స్కోరింగ్‌ పద్ధతిలో బైడెన్‌ స్కోరు 9గా ఉంది.ఇది చాలా గంభీర స్థాయి క్యాన్సర్‌ను సూచిస్తుంది.ఈ స్థాయికి చేరుకోవడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది.ఇదే వైద్యుడు గతంలో బైడెన్‌ మానసిక ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అంశం కాదు.కానీ ఇది దేశ భద్రతకు ప్రమాదకరం.ప్రజలకు నిజాలు తెలియాలి.కానీ కొందరు వాస్తవాలను దాచిపెడుతున్నారు. ఇదొక భారీ సమస్య"అని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

జిల్‌ బైడెన్‌ నకిలీ వైద్యురాలు 

ఈ అంశంపై ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా తన అభిప్రాయం వెల్లడించారు. బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె డాక్టర్‌ అయినప్పటికీ, భర్తలో క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను ''నకిలీ వైద్యురాలు''గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు.